BRS: సిట్టింగ్‌లకు నో ఛాన్స్?

BRS: మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక

Update: 2024-01-10 06:37 GMT

BRS: సిట్టింగ్‌లకు నో ఛాన్స్?

BRS: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్‌ఎస్.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు బదులుగా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ స్థానాలు వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, జహీరాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ లాంటి పార్లమెంట్ స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో సైతం కొత్త అభ్యర్థులకు ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటామనే అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.

ఇక రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో సిట్టింగ్‌లకు చెక్ పెట్టే యోచనలోనే బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చకపోవడంతోనే ఓటమి పాలయ్యామనే అంశాన్ని సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. ఇదే విషయాన్ని జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ ప్రస్తావించారు. ఇక పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను సన్నాహాక సమావేశాల్లోనే ప్రకటిస్తున్నారు. చేవెళ్ల, కరీంనగర్, ఖమ్మం పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను కార్యకర్తల సమావేశాల్లోనే అనౌన్స్ చేశారు. ఇక మిగతా సీట్లలో అభ్యర్థుల మార్పులు తప్పదనే సంకేతాలు ఇస్తోంది గులాబీ అధిష్టానం.

Tags:    

Similar News