Municipal Elections 2020: ఆయనది ఒక్క ఓటు విజయం.. ఈయనది మూడు ఓట్ల గెలుపు!

Update: 2020-01-26 07:59 GMT

ఒకటి.. ఈ అంకెకు చాలా బలం ఉంటుంది. ఏ పనైనా మొదటి అడుగుతోనే మొదలవ్వాలి. ఒక్క తప్పు మాట సన్నిహితులను దూరం చేయవచ్చు. ఒక్క మంచి మాట వెలది మందిని మన అనుచరులుగా మార్చేయవచ్చు. ఒక్క అడుగు శిఖరం వైపు నడిపించేయవచ్చు. అదే ఒక్క తప్పటడుగు జీవితాన్ని అధఃపాతాళంలోకి తోసేయవచ్చు. అందుకే ఒక్కటి అనే పదాన్ని తేలికగా తీసిపారేయలేము. ముఖ్యంగా పోటీలలో..పందేలలో. ఇంకా ముఖ్యంగా ఎన్నికలలో! ఇప్పుడు ఈ 'ఒక్క' సంగతి ఎందుకంటే..

ఎన్నికల్లో ఒక్క ఓటు మార్చేసిన తలరాతల గురించి చెప్పటం కోసమే! ఒక్క ఓటు కూడా అతి ముఖ్యమైనదే అని రాజకీయులు చెబుతారు. సరిగ్గా ఆ ఒక్క ఓటు తాజాగా తెలంగాణా లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొందరి తలరాత మార్చేసింది. ఆ వివరాలు..

నారాయణపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌సలీం సమీప అభ్యర్థి చలపతిపై ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించి లక్కీ వీరుడుగా నిలిచారు. ఇందులో మహ్మద్‌ సలీంకు 311ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి చలపతికి 310 ఓట్లు వచ్చాయి. కానీ బీజేపీ అభ్యర్థి మళ్ళీ రీకౌంటింగ్ చేయాలనీ అధికారులును కోరారు అయిన అదే లెక్క వచ్చింది. దీనితో ఒక్క ఓటు తేడాతో మహ్మద్‌సలీం విజయం సాధించాడు. ఈ సందర్భంగా మహ్మద్‌సలీం మాట్లాడుతూ కౌన్సిలర్‌గా గెలవడాన్ని ఓ అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ఇక వడ్డేపల్లి మున్సిపాలిటీలోని ఇదే సీన్ రీపీట్ అయింది. అక్కడ 7వ వార్డు అభ్యర్థి ఎన్‌.అజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వేదవతిపై కేవలం మూడు ఓట్ల తేడాతో విజయం సాధించాడు. దీనితో కాంగ్రెస్‌ అభ్యర్థి వేదవతి రీకౌంటింగ్ చేయాలనీ అధికారులును కోరగా ఆమె కోరిక మేరకు రీకౌంటింగ్ చేశారు. దీనితో రెండో సారి కూడా అదే లెక్క రావడంతో అజయ్‌కుమార్‌ను విజేతగా ప్రకటించారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News