Hyderabad: నకిలీ మెడిసిన్ గుట్టురట్టు.. 26 లక్షల విలువగల నకిలీ మందులు సీజ్
Hyderabad: పువ్వాడ లక్ష్మణ్ అనే వ్యక్తికి కొరియర్ వచ్చినట్టు గుర్తించిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు
Hyderebad: నకిలీ మెడిసిన్ గుట్టురట్టు.. 26 లక్షల విలువగల నకిలీ మందులు సీజ్
Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ మెడిసిన్ దందా గుట్టు రట్టు చేశారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. నకిలీ యాంటీబయాటిక్స్ ,హైపర్ టెన్షన్ ,కొలస్ట్రాల్ మందులను సీజ్ చేశారు. ఈ నకిలీ మందులు ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ నుంచి దిల్‌సుక్‌నగర్‌కి కొరియర్ లో వచ్చినట్టు డీసీఏ అధికారులు గుర్తించారు. పువ్వాడ లక్ష్మణ్ అనే వ్యక్తికి కొరియర్ ద్వారా వచ్చినట్టు సమాచారం రావడంతో.. రైడ్ చేసి పట్టుకున్నారు. మొత్తం 26 లక్షల విలువగల నకిలీ మందులు సీజ్ చేసి.. నలుగురిని అరెస్ట చేశారు.