GHMC వార్డుల డీలిమిటేషన్‌పై అభ్యంతరాల వెల్లువ: 4,616 ఫిర్యాదులు నమోదు
GHMCలో వార్డుల డీలిమిటేషన్‌పై వెల్లువలా అభ్యంతరాలు ఇప్పటివరకు 4,616 మంది ఫిర్యాదు లిఖితపూర్వక అభ్యంతరాలకు నేటితో తుది గడువు ఇవాళ్టి నుంచి పదిరోజుల పాటు అభ్యంతరాలపై పరిశీలన
GHMC వార్డుల డీలిమిటేషన్‌పై అభ్యంతరాల వెల్లువ: 4,616 ఫిర్యాదులు నమోదు
GHMCలో వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాల స్వీకరణ తుదిదశకు చేరుకుంది. లిఖితపూర్వక అభ్యంతరాల అభ్యంతరాల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. ఇటీవల GHMC పరిధిలో వార్డులను 3 వందలకు పెంచుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదిక, సరిహద్దుల అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని అభ్యంతరాలు అధికారుల దగ్గరకు వచ్చాయి. ఇవాళ్టి నుంచి అధికారులు అభ్యంతరాలను పరిశీలిస్తారు.
వార్డల డీలిమిటేషన్ పై ఇప్పటివరకు 4వేల 616 మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న ఒకరోజే 14వందల 76 మంది లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా అభ్యంతరాలను 40వేల ఓటర్లకు మించకుండా వార్డులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వార్డుల పేర్లను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల మేరకే అప్లికేషన్స్ పరిష్కరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
300 డివిజన్ల సంఖ్య అలాగే ఉంటుందని, సరైన ఫిర్యాదులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని డివిజన్ల హద్దులను స్వల్పంగా మార్చుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అభ్యంతరాలన్నింటినీ జోన్ల వారీగా పరిశీలించి మూడ్రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. జడ్సీలు, నగర ముఖ్య ప్రణాళికాధికారి శ్రీనివాస్, అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ నేటి నుంచే పరిశీలన చేయనుంది.