ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి నోటీసులు

Jeevan Reddy: రూ.20 కోట్ల రుణాన్ని వడ్డీతో చెల్లించాలన్న టీఎస్ ఎస్ఎఫ్‌సీ

Update: 2023-12-12 04:48 GMT

ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి నోటీసులు

Jeevan Reddy: ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవలే బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ, విద్యుత్ శాఖల నోటీసులు జారీ చేయగా.. తాజాగా తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా నోటీసులిచ్చింది. తన భార్య పేరిట 2017లో తీసుకున్న 20 కోట్ల రుణాన్ని వడ్డీతో చెల్లించాలని మామిడిపల్లిలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులిచ్చారు అధికారులు. ఎన్నిసార్లు నోటీసులిచ్చినా స్పందించడం లేదన్న అధికారులు... నిర్ణీత సమయంలో రుణం చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీవన్ రెడ్డితో పాటు ష్యూరిటీ పెట్టిన మరో నలుగురికి కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News