Maheshkumar Goud: కాంగ్రెస్‌ సభకు పరేడ్‌ గ్రౌండ్‌ ఇవ్వకపోవడం కుట్ర

Maheshkumar Goud: ఎన్ని కుట్రలు చేసినా హైదరాబాద్‌లోనే సభ పెడతాం

Update: 2023-09-05 14:04 GMT

Maheshkumar Goud: కాంగ్రెస్‌ సభకు పరేడ్‌ గ్రౌండ్‌ ఇవ్వకపోవడం కుట్ర

Maheshkumar Goud: గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ అత్యవసర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో CWC సమావేశాలు హైదరాబాద్‌లో పెట్టాలని నిర్ణయించామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఈ నెల 16, 17వ తేదీ రెండు రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయని మహేష్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. 17న సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో 10లక్షల మంది ప్రజలతో పబ్లిక్ మీటింగ్ పెడతామని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి కాంగ్రెస్‌ సభకు పరేడ్ గ్రౌండ్‌ ఇవ్వకుండ కుట్ర చేస్తున్నారని మహేష్ కుమార్‌ గౌడ్ ఆరోపించారు. వరంగల్‌లో అమిత్‌షా మీటింగ్ ఉంటుందని చెప్పిన బీజేపీ...కుట్రలో భాగంగానే సభను హైదరాబాద్‌కు షిప్ట్ చేసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు.

Tags:    

Similar News