Jagtial: ప్రేమ వివాహం.. కర్రలతో కొట్టి సినీ ఫక్కీలో నవ వధువు కిడ్నాప్

Jagtial: జగిత్యాల జిల్లాలో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపింది. మల్యాల మండలం కేంద్రానికి చెందిన ముత్తుకుమార్, గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన మాధవి ప్రేమించుకున్నారు.

Update: 2025-11-25 06:30 GMT

 Jagtial: ప్రేమ వివాహం.. కర్రలతో కొట్టి సినీ ఫక్కీలో నవ వధువు కిడ్నాప్

Jagtial: జగిత్యాల జిల్లాలో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపింది. మల్యాల మండలం కేంద్రానికి చెందిన ముత్తుకుమార్, గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన మాధవి ప్రేమించుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో వారం రోజుల క్రితం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటికి వచ్చి గొడవచేయడంతో ముత్తుకుమార్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమ్మాయి తరపు వారి నుండి ప్రాణభయం ఉందని ముత్తు కుటుంబ సభ్యులు ఈనెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అమ్మాయి తరపు వారు అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. కట్టెలతో దాడి చేసి మహిళలపై, అబ్బాయి తండ్రిని చంపుతామని బెదిరించి అమ్మాయిని కొడుతూ లాక్కోని కారులో తీసుకుని వెళ్లారు. అమ్మాయిని తమకు అప్పగించాలని, తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.

Tags:    

Similar News