Hyderabad: అబిడ్స్‌ వ్యభిచార ముఠా అరెస్టులో కొత్త కోణాలు

Hyderabad: అఖిల్‌తో పాటు పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్,..

Update: 2024-01-20 14:00 GMT

Hyderabad: అబిడ్స్‌ వ్యభిచార ముఠా అరెస్టులో కొత్త కోణాలు

Hyderabad: హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో పట్టుబడ్డ వ్యభిచార ముఠా అరెస్టు వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగుచూశాయి. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్.. పాత ట్రాక్ రికార్డును పోలీసులు బయటకు తీశారు. అఖిల్ ఫోన్‌లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచార ముఠా పేర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోజుకి 20 నుంచి 30 ఫోన్ కాల్స్‌ నిర్వాహకులతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. బెంగాల్‌కు చెందిన 16 మంది యువతులతో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తమ దర్యాప్తు గుర్తించారు పోలీసులు. ఎలాంటి ఆధారాలు లేకుండా యువతులను హోటల్‌లో ఉంచినట్లు వెల్లడించారు. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో అఖిల్ సహా రఘుపతి, అభిషేక్, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News