సీఎం కేసిఆర్ వ్యాఖ్యలకు నెటిజన్లు ఫిదా

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవుతున్నాయి. ఒకట్ల సంఖ్య నుంచి, పదుల్లోకి, పదుల సంఖ్య నుంచి వందల్లోకి పెరిగిపోతున్నాయి.

Update: 2020-04-07 04:33 GMT
KCR (File Photo)

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవుతున్నాయి. ఒకట్ల సంఖ్య నుంచి, పదుల్లోకి, పదుల సంఖ్య నుంచి వందల్లోకి పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో లాక్ డౌన్ ఎత్తేస్తే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని, రాష్ట్ర ప్రజలు ఆగం అవుతారని తెలంగాణ సీఎం కేసిఆర్ నిన్న జరిగిన ప్రెస్ మీట్‌లో చెప్పారు. లాక్‌డౌన్‌ను ఒక్కసారిగా ఎత్తేస్తే ప్రజలు అందరు బయటికి వస్తారని, అప్పుడు కరోనా మరింత ప్రబలుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా రెండో దశ దాటి మూడో దశలో ప్రవేశిస్తుందనీ, అందుకే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. కాని ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం కొంచెం బెటర్ గా వుందని ఆయన అన్నారు.

ఇలా భారత్ కరోనా కాస్త అదుపులో వుండడానికి కారణం21 రోజుల పాటు విధించిన ఈ లాక్‌డౌన్‌ అని అన్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. అత్యవసరం, నిత్యవసర వస్తువుల కోసం మాత్రమే బయటికి వెళ్తున్నారని అన్నారు. కానీ.. మరో వారంలో లాక్‌డౌన్ గడువు ముగియబోతోంది. ఈ సమయం లో ఉన్నపళంగా లాక్ డౌన్ తీసేస్తే కేసులు సంఖ్య పెరిగి ప్రమాదం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నిన్న జరిగిన ప్రెస్ మీట్‌లో సీఎం కేసిఆర్ చెప్పారు. అందుకే మరో వారం, రెండు వారాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని పీఎం ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం దేశానికి, రాష్ట్రానికే మంచిదని దేశం ఆర్థికంగా నష్టపోయిన, పర్వాలేదు కాని ప్రాణాలు పోతే కష్టమని సీఎం ఈ సందర్భంగా అన్నారు.

ప్రెస్ మీట్ లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఎవరి స్టైల్ లో వారు స్పందించారు. ప్రధాని మోదీ కరోనా విషయంలో బిగ్‌బాస్ అయితే, సీఎం కేసీఆర్ హోస్ట్ అని సందేశాలు ఇస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు పూర్తి మద్దతు ఉంటుందని తెలుపుతున్నారు.ఇలాంటి సందర్భాల్లో సీఎం కేసీఆర్ లాంటి నాయకుడిని తీసుకురాగలమా? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే మాటలు కాదంటున్నారు. కానీ సీఎం కేసిఆర్ ప్రజల మంచికోసం లీడర్‌షిప్ క్వాలిటీస్ ప్రదర్శిస్తున్నారని, ప్రజలకు అండగా వున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.




Tags:    

Similar News