ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు..

రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఓటర్ల లిస్టులో తప్పులు ఉన్నట్టుగానే, ప్రస్తుతం జరగబోయే సహకార సంఘం ఎన్నికల ఓటరు జాబితా కూడా తప్పుల తడకగా మారింది.

Update: 2020-02-10 08:54 GMT

రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఓటర్ల లిస్టులో తప్పులు ఉన్నట్టుగానే, ప్రస్తుతం జరగబోయే సహకార సంఘం ఎన్నికల ఓటరు జాబితా కూడా తప్పుల తడకగా మారింది. బతికున్న వారి పేర్లు ఓటరు జాబితాలో లేవు కానీ చనిపోయిన వారి పేర్లు మాత్రం జాబితాలో ఉడడం గమనార్హం.

పూర్తి వివారల్లోకెళితే నగర శివార్లలో షాద్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో మేకగూడ, నందిగామ, చేగూరు, కొత్తపేట, షాద్‌నగర్, కొందుర్గులో వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో మొత్తంగా చూసుకుంటే 16740 మంది ఓటర్లు ఉన్నారు. కాగా వీరికి సంబంధించిన ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేయగా అందులో ఎక్కువ శాతం మృతి చెందిన వారి పేర్లే ఉన్నాయి. సంఘంలో సభ్యులుగా ఉన్న సమయంలో చనిపోయిన రైతుల పేర్లను జాబితాలో నుంచి తొలగించకుండానే జాబితాను విడుదల చేసారు.

కాగా ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సహకార సంఘం రూపొందించి దాన్ని ముందుగా కార్యాలయంలో ప్రదర్శించాలి. తరువాత ఆ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించాలి. కానీ ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే జాబితాను విడుదల చుసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా ఈసారి ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను విడుదల చేయగా అందులో చాలా మంది ఫొటోలు కనిపించడం లేదని సభ్యలు ఫిర్యాదు చేస్తున్నారు. ఫోటోలు లేకుండా ఓటర్లను గుర్తించడం చాలా క్లిష్టంగా ఉందరి కొంతమంది నాయకులు అంటున్నారు.

Tags:    

Similar News