Kalvakuntla Kavitha: బోగస్ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
Kalvakuntla Kavitha: బోగస్ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Kalvakuntla Kavitha: బోగస్ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
Kalvakuntla Kavitha: బోగస్ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మంజీరా ముంపుకు గురైన రైతులను ఆమె పరామర్శించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వర్షాల కారణంగా నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, పంట నీటమునిగిన రైతులను పట్టించుకునే నాథుడే కరువైయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసి ఎకరాకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.