Kalvakuntla Kavitha: 'సీఎం సీఎం' నినాదాలతో హోరెత్తిన ఎయిర్‌పోర్ట్.. గల్లంతైన కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు!

Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటన ముగించుకుని నిన్న రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద కవితకు అభిమానులు భారీ స్వాగతం పలికారు.

Update: 2025-05-24 06:02 GMT

Kalvakuntla Kavitha: 'సీఎం సీఎం' నినాదాలతో హోరెత్తిన ఎయిర్‌పోర్ట్.. గల్లంతైన కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు!

Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటన ముగించుకుని నిన్న రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద కవితకు అభిమానులు భారీ స్వాగతం పలికారు. ‘టీమ్ కవితక్క’ పేరుతో భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయగా, ఆమెకు గట్టిగా నినాదాలు కూడా చేసారు.

అయితే ఈ స్వాగత వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలు గానీ, పార్టీ జెండాలు గానీ లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘సీఎం సీఎం’, ‘జై కవితక్క’, ‘కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ అభిమానులు నినాదాలు చేయడం విశేషం.

కవిత ఈ నెల 16న తన భర్త అనిల్‌తో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. తన కుమారుడి కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ పర్యటనకు వెళ్లారు. ఇదిలా ఉండగా, ఇటీవల తండ్రి కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, పార్టీ నేతల్లో తీవ్ర చర్చలకు దారి తీసినట్టు సమాచారం. ఇప్పటికే ఆ లేఖపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుండగా, తాజా స్వాగత ఏర్పాట్లు మరింత చర్చకు తావిచ్చాయి.

Tags:    

Similar News