Telangana MLC Elections 2025: నేడు తెలంగాణలో మూడు శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు స్థానాలే అయినా అధికారులు మాత్రం ఎలాంటి రాజీ పడకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది.
ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, ఉపాధ్యాయ నియోజకవర్గం కింద 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతుంది. ఇలా మూడు ఎన్నికలకు మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఓటరు ఐడీ కార్డు ఉంటే సరిపోతుంది. అది లేనట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తున్ను 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదొకటి చూపించి కూడా ఓటు వచేయవచ్చు. ఓటు వేసేటప్పుడు అభ్యర్థి ఫొటో పక్కన1,2,3,4,5..వరుస సంఖ్యలతో ఓటు వేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రాధాన్య క్రమం కూడా తెలుసుకుంది. కౌంటింగ్ నాడు ఈ ప్రాధాన్య క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
కాగా ఉమ్మడి నిజామాబాద్ , మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉండగా..ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘోత్తమ్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు. వీరంతా మార్చి 29 వరకు ఆ పదవుల్లో కొనసాగుతారు. అయితే మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తర్వాత ఎవరన్నది అదే రోజు తేలిపోతుంది.