MLA Manohar Reddy: మీర్జాగూడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ

MLA Manohar Reddy: తాండూర్ శాసనసభ్యులు (MLA) మనోహర్‌రెడ్డి, మీర్జాగూడ వద్ద ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థిక సహాయం అందించారు.

Update: 2025-11-05 08:45 GMT

MLA Manohar Reddy: మీర్జాగూడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ 

MLA Manohar Reddy: తాండూర్ శాసనసభ్యులు (MLA) మనోహర్‌రెడ్డి, మీర్జాగూడ వద్ద ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజల భద్రత దృష్ట్యా తాండూర్-వికారాబాద్ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని హామీ ఇచ్చారు.

"ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాండూర్-వికారాబాద్ రోడ్డును రాబోయే మూడు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాము. రోడ్డు ప్రమాదాలు జరగకుండా శాశ్వత చర్యలు తీసుకుంటాము" అని ఆయన ప్రకటించారు.

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం (చెక్కులు) అందించిన అనంతరం, వారికి ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో రాజకీయాలు చేయకుండా, బాధిత కుటుంబాలకు అందరూ మానవతా దృక్పథంతో అండగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Tags:    

Similar News