ఎవరి కిందపడితే వారికింద పనిచేయలేను.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు...
Rajgopal Reddy: ఇటీవల అసెంబ్లీలో మంత్రి తలసానితో మాటల యుద్ధం సందర్భంగా కాంగ్రెస్ నేతలు తనకు మద్దతుగా నిలబడలేదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఎవరి కిందపడితే వారికింద పనిచేయలేను.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు...
Rajgopal Reddy: ఇటీవల అసెంబ్లీలో మంత్రి తలసానితో మాటల యుద్ధం సందర్భంగా కాంగ్రెస్ నేతలు తనకు మద్దతుగా నిలబడలేదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గౌరవం లేని చోట ఉండలేనని.. తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై ఫైట్ చేస్తానని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి కింద పడితే వారి కింద పనిచేయలేనని... తనను నమ్మినవారు వెంట రావొచ్చునని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా ఉంటే కేసీఆర్‌ను ఢీకొట్టేవారితో కలిసి నడుస్తానన్నారు. తాను కాంగ్రెస్‌ను వీడినా గౌరవంగా రాజీనామా చేసి వెళ్తానన్నారు. 8 ఏళ్ల పాలనలో ఏమీ చేయని కేసీఆర్ ఇప్పడేం చేస్తారని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా మునుగోడు పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడారు.