Danam Nagender: అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల పై ఎమ్మెల్యే దానం తీవ్ర పదజాలం
Danam Nagender: హైదరాబాద్ అభివృద్ధిపై దానం మాట్లాడుతుండగా బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం
Danam Nagender: అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల పై ఎమ్మెల్యే దానం తీవ్ర పదజాలం
Danam Nagender: అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు గందరగోళ పరిస్థితికి దారి తీశాయి. హైదరాబాద్ అభివృద్ధిపై దానం మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన దానం.. తీవ్ర పదజాలంతో బీఆర్‌ఎస్ సభ్యులపై మండిపడ్డారు. దీనిపై స్సందించిన mim ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. సభలో అభ్యంతకర వ్యాఖ్యలు మంచిది కాదని సూచించారు. సీనియర్ శాసనసభ్యులుగా దానం నాగేందర్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని ఓవైసీ కోరారు. బీఆర్ఎస్ సభ్యులు రెచ్చగొట్టడంతోనే సహనం కోల్పోయానని, తాను చేసిన వ్యాఖ్యలపట్ల చింతిస్తున్నానని దానం నాగేందర్ వివరణ ఇచ్చారు.