Minister Vemula: అపర భగీరథుడు సీఎం కేసీఆర్.. కలలో కూడా ఊహించలేదు..

Minister Vemula: గోదావరి జలాలను ఎగువకు తరలించిన కృషీవలుడు కేసీఆర్

Arun Chilukuri
Updated on: 6 July 2023 4:36 PM IST
Minister Vemula Says Apara Bhagiratha is CM KCR
X

Minister Vemula: అపర భగీరథుడు సీఎం కేసీఆర్.. కలలో కూడా ఊహించలేదు..

Vemula Prashanth Reddy: గోదారమ్మ ఎదురు ఎక్కుతదని కలలో కూడా ఊహించలేదు. నేడు అది నిజమైంది. రైతుల కల నెర వెరిన రోజు ఇది అని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం ఎస్సారెస్పీ వరద కాలువకు కాళేశ్వరం జలాలు చేరుకోవడంతో నిజామాబాద్‌ జిల్లాలోని కమ్మర్‌పల్లి మండలం ఉప్లుర్ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి పూజలు చేసి మాట్లాడారు.

అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. శ్రీరాంసాగర్ కు పునరుజ్జీవం కల్పించారని తెలిపారు. 281 కిలోమీటర్ల దూరం వరకు నీళ్లు మళ్లించారన్నారు. గోదావరి జలలాలను ఎగువకు తరలించిన కృషీవలుడు కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరంతో బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి విపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story