Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గెలిచిన సర్పంచులకు పొన్నం సన్మానం
Ponnam Prabhakar: ప్రజా పాలన ప్రభుత్వంపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
Ponnam Prabhakar: ప్రజా పాలన ప్రభుత్వంపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొదటి విడతలో గెలిచిన సర్పంచులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానం చేశారు. గెలిచిన సర్పంచులతో సమన్వయంతో అభివృద్ధికి కృషి చేస్తానని.. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రతిపాదనలు, గెలిచిన సర్పంచులు తీసుకువస్తే నిధులు మంజూరుకి కృషి చేస్తానని అన్నారు. శాతవాహన యూనివర్సిటీకి 100 కోట్ల నిధుల మంజూరు చేయాలని మంత్రుల బృందంతో సీఎంని కలిసి కోరుతామన్నారు.