Malla Reddy: మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట
Malla Reddy: ఆర్వో సమాధానమిచ్చారని కోర్టుకు తెలిపిన న్యాయవాది
Malla Reddy: మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట
Malla Reddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికల అఫిడవిట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మల్లారెడ్డి అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని... ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషన్ లో పిటిషనర్ పేర్కొన్నారు. మల్లారెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా ఆదేశాలను జారీ చేయాలని పిటిషనర్ అంజిరెడ్డి కోర్టును కోరారు. అయితే మల్లారెడ్డి అఫిడవిట్‌పై అంజిరెడ్డికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చారని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.