KTR: హైదరాబాద్ మెట్రోలో మంత్రి కేటీఆర్ సందడి
KTR: మెట్రోలో ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి కేటీఆర్
KTR: హైదరాబాద్ మెట్రోలో మంత్రి కేటీఆర్ సందడి
KTR: హైదరాబాద్ మెట్రోలో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. ఆయన ఏ హంగు ఆర్భాటం లేకుండా సాధారణ వ్యక్తిలా మెట్రోలో ప్రయాణించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి బేగంపేట మెట్రో వరకు ప్రయాణించిన మంత్రి కేటీఆర్..ప్రయాణికులతో ముచ్చటించారు. ఏ ప్రోటోకాల్ లేకుండా మెట్రో రైలులోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్‌ను తొలుత ప్రయాణికులు గుర్తు పట్టలేదు. తరువాత గుర్తుపట్టి ఆయనతో సెల్ఫీలు దిగడానికి ప్రయాణికులు ఎగబడ్డారు. సంయమనంతో వ్యవహరించిన మంత్రి కేటీఆర్..అందరికి ఓపికతో సెల్ఫీలిచ్చారు.