KTR: ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటు.. కేటీఆర్ కంటతడి..
KTR: సాయిచంద్ నివాసం దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గుర్రంగూడ నివాసంలో సాయిచంద్ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
KTR: ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటు.. కేటీఆర్ కంటతడి..
KTR: సాయిచంద్ నివాసం దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గుర్రంగూడ నివాసంలో సాయిచంద్ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయిచంద్‌కు రాష్ట్రమంత్రులు, పలువురు నేతలు నివాళులర్పించారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు.
సాయిచంద్ అద్భుతమైన కళాకారుడని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారని వెల్లడించారు. సాయిచంద్ మరణం తీరని లోటని తెలిపారు. ఉద్యమంలో పాటల ద్వారా అందరిని ఏకం చేశారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా పాటలు పాడారని చెప్పారు. ఆయన హైదరాబాద్‌లో ఉంటే బతికేవాడేమో. స్వగ్రామానికి వెళ్లడం.. అక్కడే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. సాయిచంద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం అని కేటీఆర్ అన్నారు.