Harish Rao: త్వరలో ఎయిర్ అంబులెన్స్‌లు ప్రవేశపెట్టబోతున్నాం
Harish Rao: సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు ఆస్పత్రుల నిర్మాణం
Harish Rao: త్వరలో ఎయిర్ అంబులెన్స్‌లు ప్రవేశపెట్టబోతున్నాం
Harish Rao: సీఎం కేసీఆర్ నాయత్వంలో ఒక్క వైద్యరోగ్యాశాఖలోనే 22 వేల 600 ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. వైద్యరోగ్య శాఖపై మూడింతలు బడ్జెట్ పెంచామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాక ముందు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో 30 శాతం డెలివరీలు ఉంటే ఇప్పుడు 76 శాతానికి పెరిగిందన్నారు. మాతా శిశువు మరణాల సంఖ్య బాగా తగ్గిందన్నారు హరీష్ రావు. ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని నగరం నాలుగు వేపులా ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. గతంలో 17వేల బెడ్స్ ఉంటే ఇప్పుడు 37 వేలకు పెంచామన్నారు హరీష్‌రావు. త్వరలో ఎయిర్ అంబులెన్సు లను ప్రవేశ పెట్టబోతున్నామని హరీష్ చెప్పారు.