Methuku Anand: 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఘనత కేసిఆర్‌కే దక్కుతుంది
Methuku Anand: ప్రజా సంక్షేమం కోరుకునే బీఆర్ఎస్ ను గెలిపించండి
Methuku Anand: 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఘనత కేసిఆర్‌కే దక్కుతుంది
Methuku Anand: రైతుల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తూ 24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ నుగెలిపించాలని వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ నియోజక వర్గంలో మెతుకు ఆనంద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వికారాబాద్ ప్రజల చిరకాల కోరిక మేరకు వికారాబాద్ ను సీఎం కేసీఆర్ జిల్లాగా చేసారన్నారు. ప్రజల సంక్షేమం కోరుకునే బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.