హైదరాబాద్ కూకట్‌పల్లిలో జలకన్యల సందడి..
Mermaid Show: అప్పడప్పుడు సోషల్ మీడియాలో జలకన్యలు అంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో జలకన్యల సందడి..
Mermaid Show: అప్పడప్పుడు సోషల్ మీడియాలో జలకన్యలు అంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. నడుం వరకు చేప ఆకారం ఉండి అందమైన అమ్మాయిలను జలకన్యలుగా కొందరు గ్రాఫిక్స్ ఫోటోలు, వీడియోలు వైరల్ చేస్తూ ఉంటారు. ఇక విదేశాల్లో ముఖ్యంగా సముద్ర ప్రాంతాలను కలిగి ఉన్న దేశాల్లో జలకన్యల థీమ్‌తో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆకట్టుకుంటారు. ఇలాంటి థీమ్ ఎగ్జిబిషన్ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ నగర ప్రజలను అలరిస్తోంది. కూకట్‌పల్లిలో ఈ జల కన్యలు ఆకట్టుంటున్నారు. మెరైన్ పార్క్‌లో జరిగే ఎగ్జిబిషన్‌లో జలకన్యలతో నిర్వహకులు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్ట మొదటిసారి హైదరాబాద్‌లో ఈ థీమ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జలకన్య రూపంలో ఉన్న ముగ్గురు యువతులు నీటిలో విన్యాసాలు చేస్తున్నారు.
జలకన్యలను చూసే అందుకు చిన్న పెద్ద అనే తేడా లేదు ఇంకా అందరూ ఇక్కడికి వచ్చి సందడి చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో చిన్న పిల్లల కేరింతలు, పెద్దల సందడితో ఉల్లసభరితంగామారింది. జలకన్యల విన్యాసాలు చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. కూకట్‌పల్లి సిస్టం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జలకన్యలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. జలకన్యలను చూసేందుకు నగర ప్రజలు బారులు తీరుతున్నారు. నిజమైన జల కన్యలు ఎలా ఉంటారో తెలియని వారు ప్రదర్శనలో జలకన్యల రూపంలో ఉన్న యువతులను నిజమైన జలకన్యలుగా భావించి సెల్ఫీలు తీసుకుంటున్నారు.. చిన్న పిల్లల నుంచి పెద్దవాలా వారికీ జలకన్యలను చూస్తూ సందడి చేస్తున్నారు.