పది రూపాయల నాణాలను తీసుకోనంటున్న వ్యాపారులు
ములుగు జిల్లా మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లోని వ్యాపారులు పది రూపాయల నాణేలు చెల్లవంటూ తీసుకోవడం లేదు.
ఏటూరునాగారం: ములుగు జిల్లా మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లోని వ్యాపారులు పది రూపాయల నాణేలు చెల్లవంటూ తీసుకోవడం లేదు. బ్యాంకులు మాత్రం ఖాతాదారులకు ఆ నాణేలను అంటగడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కానీ అవే బిల్లలను తీసుకోవడానికి బ్యాంకుల అధికారులు ససేమిరా అంటున్నారు. ఆయా బ్యాంకుల మేనేజర్లు పది రూపాయల బిళ్లను తీసుకోవడం లేదు. దీంతో ఆ బిల్లలు ఉన్న ప్రజలు వాటిని మార్చుకోవడానికి పడరానిపాట్లు పడుతున్నారు.
బ్యాంకులే తీసుకొనప్పుడు మేము కూడా తీసుకోమని వ్యాపారులు సైతం మొండికేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు సైతం పది రూపాయల బిల్లలు తీసుకోవాలని, వాటిని ఎవరూ నిషేధించలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నా, ఆర్బీఐ ఆదేశాలను బ్యాంకుల అధికారులు పాటించకపోవడం శోచనీయం.