నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రేపు జాబ్ మేళా
ఎంప్లాయిమెంట్ కార్యాలయం నాగర్ కర్నూల్ వారి ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా.
నాగర్ కర్నూల్: ఎంప్లాయిమెంట్ కార్యాలయం నాగర్ కర్నూల్ వారి ఆధ్వర్యంలో పేరం గ్రూప్ ఆఫ్ డెవలపర్స్, కార్వే ఫోర్బ్స్, క్రిస్టల్ మేనేజ్మెంట్ సర్వీసెస్, అపోలో మెడిస్కిల్స్, వరుణ్ మోటర్స్, స్విగ్గి ప్రోడక్ట్స్, అపోలో ఫార్మసీ మొదలగు ప్రైవేట్ కంపెనీలలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫార్మసీ అసిస్టెంట్, మార్కెటింగ్ మేనేజర్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్, ప్యాకింగ్ అసిస్టెంట్స్, డ్రైవర్, డెలివరీ బాయ్స్ మొదలగు దాదాపు ఐదువందల ఉద్యోగ ఖాళీల భర్తీకై 28-12-2019 నాడు ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించబడును.
కావున అర్హత పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, ఫార్మసీ, డిప్లమా చదివిన వారు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన 18 నుండి 35 సంవత్సరాలు వయస్సు మద్యలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సర్టిఫికెట్స్, ఆధార్ తో హాజరుకాగలరు. స్థలం నేషనల్ ఐటిఐ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా నాగర్ కర్నూలు నందు నిర్వహించే ఉద్యోగ మేళాకు హాజరు కాగలరు. ఎన్నికైన అభ్యర్థులు హైదరాబాద్లో పని చేయవలసి ఉటుంది. నెలకు 10 వేల నుండి 15 వేల జీతం ఇవ్వబడును. ఇతర వివరములకు 9701200819 నంబర్ ని సంప్రదించగలరు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రేపు జాబ్ మేళా