Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌

Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియామకమయ్యారు. దీపాదాస్‌ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ.. కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2025-02-15 02:33 GMT

Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియామకమయ్యారు. దీపాదాస్‌ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ.. కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్‌ టీమ్‌లో మీనాక్షి నటరాజన్‌ కీలకంగా ఉన్నారు. తెలంగాణతో పాటు.. పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది ఏఐసీసీ. మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్.. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పని చేస్తూ వచ్చారు. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ వింగ్ లలో అలాగే.. AICCలో కీలక బాధ్యతల్లో పనిచేశారు. 2009 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ నుంచి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అయితే తర్వాత రెండు సార్లు ఓడిపోయారు. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీమ్ సభ్యురాలిగా గుర్తింపు పొందారు.

అలాగే, హిమాచల్‌ప్రదేశ్‌, చండీగఢ్‌ కాంగ్రెస్‌ పార్టీ కొత్త ఇంఛార్జిగా రజనీ పాటిల్‌; హరియాణా- బీకే హరిప్రసాద్‌, మధ్యప్రదేశ్‌ - హరీశ్‌ చౌదరి, తమిళనాడు, పుదుచ్ఛేరి- గిరీశ్‌ చోడాంకర్‌; ఒడిశా - అజయ్‌ కుమార్‌ లల్లూ, జార్ఖండ్‌ - కె.రాజు; మణిపుర్‌, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌ - సప్తగిరి శంకర్‌ ఉల్కా, బిహార్‌ -కృష్ణ అల్లవారులను నియమిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించినట్లు శుక్రవారం రాత్రి ఏఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.


Tags:    

Similar News