Medaram: మేడారం మహాజాతర తేదీలు ఖరారు..!
Medaram Jathara 2025: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది.
Medaram: మేడారం మహాజాతర తేదీలు ఖరారు..!
Medaram Jathara 2025: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ పుణ్యకార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు వైభవంగా జరగనుంది.
జాతర ముఖ్యమైన తేదీలు ఇలా
జనవరి 28: సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు దేవతలను గద్దెలపై ప్రతిష్టిస్తారు.
జనవరి 29: సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరుకుంటుంది.
జనవరి 30: భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు.
జనవరి 31: అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు.
పూజారుల సంఘం ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. మేడారం జాతరను పురస్కరించుకుని లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చే అవకాశం ఉంది.