పెళ్లి పేరుతో నమ్మించి.. బంగారం, నగదుతో ఉడాయించిన కిలాడీ లేడీ!

పెళ్లయిన యువతి మరో యువకుడిని మోసం చేసి పెళ్లి చేసుకుని బంగారంతో పారిపోయిన ఘటన కలకలం రేపుతుంది.

Update: 2025-11-25 06:54 GMT

పెళ్లయిన యువతి మరో యువకుడిని మోసం చేసి పెళ్లి చేసుకుని బంగారంతో పారిపోయిన ఘటన కలకలం రేపుతుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెందిన ఓ యువకుడికి మ్యాట్రిమోనీ సైట్​ ద్వారా విజయవాడకు చెందిన యువతి పరిచయం అయింది. అనంతరం వారు వివాహం చేసుకున్నారు. అయితే వారం క్రితం ఆ యువతి ఇంట్లోని బంగారం, నగదు తీసుకుని పరారయింది. దీంతో బాధితుడు యువతి తల్లిదండ్రులను సంప్రదించే ప్రయత్నం చేయగా.. వారంతా ఫేక్​ అని తెలిసింది. తమను మోసం చేసిన యువతిపై పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.

Tags:    

Similar News