ఇవాళ చిల్కూరు బ్లాక్‌లో ఫారెస్ట్ టెక్ పార్క్ ప్రారంభం

Manchirevula: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

Update: 2023-08-26 05:26 GMT

ఇవాళ చిల్కూరు బ్లాక్‌లో ఫారెస్ట్ టెక్ పార్క్ ప్రారంభం

Manchirevula: చిల్కూరు బ్లాక్ లోని మంచిరేవులలో ఫారెస్ట్ టెక్ పార్క్‌ని ఇవాళ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఫారెస్ట్ టెక్ పార్క్‌లో మొక్క నాటి కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. మంచిరేవుల టెక్ ఫారెస్ట్ పార్కులో కోటీ 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం కానుంది. తెలంగాణకు హరితహారం పేరుతో రాష్ట్రంలో హరిత విప్లవానికి నాంది పలికింది.

2015 నుండి తెలంగాణ వ్యాప్తంగా రూ. 11 వేల 95 కోట్ల వ్యయంతో 288 కోట్ల 48 లక్షల మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, స్వచ్చమైన గాలి అందించేందుకు, జీవ వైవిధ్యతను కాపాడేందుకు 2015లోనే తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన హరితహారంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల 864 నర్సరీలను ఏర్పాటు చేశారు. నర్సరీల్లో ఈ ఏడాది 30 కోట్ల 29 లక్షల మొక్కలు పెంచారు. ఈ సీజన్‌లో 19 కోట్ల 29 లక్షల మొక్కలు నాటనున్నారు.

Tags:    

Similar News