కరీంనగర్ జిల్లాలో దారుణం.. 9నెలల గర్భిణిని రేప్ చేస్తూ సెల్‌ఫోన్లో రికార్డ్...

Update: 2019-12-17 10:27 GMT

కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9 నెలల గర్భిణిపై రామకృష్ణ అనే వర్కర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించి.. అత్యాచారం చేశాడు దుర్మార్గుడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పింది భార్య. దీంతో బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు రామకృష్ణపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా, అత్యాచారం చేసిన సమయంలో నిందితుడు తన సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Full View  

Tags:    

Similar News