హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. హోటల్ మేనేజర్ దుర్మరణం
Hyderabad: ఐదు రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. హోటల్ మేనేజర్ దుర్మరణం
Hyderabad: హైదరాబాద్ మియాపూర్ లో కాల్పులు కలకలం రేపాయి. మదీనాగూడలోని ఓ రెస్టారెంట్ జనరల్ మేనేజర్ దేవేందర్ పై దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. తుపాకీ తూటాలకు గాయపడిన దేవేందర్... కోల్ కతాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయపడిన దేవేందర్ ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.
మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దేవేందర్ స్వస్థలం కోల్ కతాగా పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని మాదాపూర్ జోన్ డీసీప్ సందీప్ రావు, మియాపూర్ ఏసీపీ నరసింహారావు పరిశీలించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.