Malreddy Rangareddy: కిషన్‌రెడ్డి పాలనలో ఇబ్రహీంపట్నం 30ఏళ్లు వెనక్కి పోయింది
Malreddy Rangareddy: ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
Malreddy Rangareddy: కిషన్‌రెడ్డి పాలనలో ఇబ్రహీంపట్నం 30ఏళ్లు వెనక్కి పోయింది
Malreddy Rangareddy: కేసిఆర్ చేతిలో తెలంగాణ బందీ అయిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శాస్త్ర ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన..గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉందో కళ్ళు తెరిచి చూడాలని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 15 ఏళ్లుగా ఒక్క పాఠశాల అయిన కట్టించారా అని అన్నారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నం కిషన్ రెడ్డి పాలనలో 30 ఏళ్లు వెనక్కి పోయిందని తెలిపారు. నియోజవర్గంలో అభివృద్ది ఏమీ జరగలేదని ,రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదల నుంచి ప్రభుత్వ భూములను లాక్కొని కబ్జా చేశారని ఆయన మండిపడ్డారు.తాను ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇండ్లు కట్టి ఇచ్చామని అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం అన్నారు.