మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార తెరాసలో చేరుతున్నారన్న వార్త వైరల్ అయింది. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర బాబు గండ్ర వెంకటరమణా రెడ్డి కేసీఆర్ సమక్షంలో టీఆరెస్ లో చేరనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు వారిరువురు చెక్ పెట్టారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను గండ్ర వెంకట రమణారెడ్డి ఈ సందర్భంగా ఖండించారు గండ్ర వెంకటరమణా రెడ్డి స్పందించారు. తానే కాదు శ్రీధర్బ్ బాబు కూడా పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర బాబు గండ్ర వెంకటరమణా రెడ్డితో ఇష్టాగోష్ఠిగా చర్చలు జరిపారు. గండ్రతో పాటు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వచ్చాయి.