Mahmood Ali: గన్‌మెన్‌ ఘటనను పట్టించుకోవద్దు... ప్రేమతో వ్యవహరించా

Mahmood Ali: ఆ గన్‌మెన్ తన కుమారుడు లాంటి వాడు

Update: 2023-10-08 03:30 GMT

Mahmood Ali: గన్‌మెన్‌ ఘటనను పట్టించుకోవద్దు... ప్రేమతో వ్యవహరించా

Mahmood Ali: గన్‌మెన్‌పై చేయిచేసుకున్న ఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. ఆ గన్‌మెన్ తన కుమారుడు లాంటి వాడని.. అందరూ తన బిడ్డలేనని స్పష్టం చేశారు. తాను ఎవరికైనా, ఎంత చిన్నవారికైనా గౌరవం ఇస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ మలక్‌పేట మహబూబ్‌ మెడిసిన్ గంజ్‌లోని మార్కెట్‌ యార్డులో 53 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ... గన్‌మెన్‌ ఘటనను పట్టించుకోవద్దని.... ప్రేమతోనే వ్యవహారించానని పేర్కొన్నారు.

కొట్టాలనే ఉద్దేశం ఏ కోశాన లేదన్నారు. అందరిని తన బిడ్డల మాదిరిగానే చూసుకుంటానని తెలిపారు. తనతో ఉన్నవారందరూ తన బిడ్డలేనని వివరణ ఇచ్చారు. శుక్రవారం నాడు తలసాని శ్రీనివాస్​యాదవ్​ పుట్టినరోజు సందర్భంగా... మంత్రి శుభాకాంక్షలు తెలుపుతున్న సమయంలో.. మహమూద్​ అలీ గన్​మెన్​చెంప చెల్లుమనిపించాడు. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Tags:    

Similar News