ఆరు రాష్ట్రాలకు ఆర్గనైజేషన్ సెక్రటరీగా మద్దిశెట్టి సామేలు
భారత మానవ హక్కుల మండలి రాష్ట్ర ఛైర్మెన్ గా ఉన్న మద్దిశెట్టి సామేలుని భారత మానవ హక్కుల మండలి సౌత్ జోనల్ రీజియన్ 6 రాష్ట్రాలకు ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమించడం జరిగింది.
సత్తుపల్లి: భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర ఛైర్మెన్ గా ఉన్న మద్దిశెట్టి సామేలుని వారు చేస్తున్నటువంటి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటాలను టైం కేటాయించి ఫుల్ టైమర్ గా తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర ఛైర్మెన్ మద్దిశెట్టి సామేలు ని ఈరోజు భారత మానవ హక్కుల మండలి సౌత్ జోనల్ రీజియన్ 6 రాష్ట్రాలకు ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమించడం జరిగింది.
ప్రముఖ సినీ నటులు, సీరియల్ హీరో అయిన నాగసాయినాథ్ గారికి భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర వైస్ ఛైర్మెన్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. 2009లో లోక్ సత్తా పార్టీ లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కి చెందిన జాడే చొక్కరావు కు కూడా భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఖమ్మం జిల్లా మధిర మండల నియోజకవర్గ ఇన్చార్జి బోనకల్ కి చెందిన దొంతు జ్వాల నరసింహం కు కూడా భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత మానవ హక్కుల మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.