MAA Elections: నేటితో ముగియనున్న నామనేషన్ ప్రక్రియ
MAA Elections: ఇప్పటికే నామినేషన్లు వేసిన ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు
నేటితో ముగియనున్న మా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ (ఫైల్ ఇమేజ్)
MAA Elections: తెలుగు చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేనివిధంగా.. 'మా' ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. ఈసారి త్రిముఖ పోరుతో పోటీ జరగుతోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. మరో అధ్యక్ష అబ్యర్థిగా సీవీఎల్ నరసింహారావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక సినీ నటుడు నిర్మాత బండ్ల గణేశ్ స్వతంత్రంగా జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేశారు. అయితే స్వతంత్రంగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినా.. ఈసారి మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌కి, మంచు విష్ణుకి మధ్య పోటీ హోరాహోరీగా జరగనుంది.
మరోవైపు నేటితో మా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. ఇక అక్టోబర్ 1, 2 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇవాళ మంచు విష్ణు, నరేష్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అజెండా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.