సోదరుడి అంత్యక్రియలు వీడియో కాల్‌లో... ఓ అడ్మిన్‌ ఎస్‌ఐ కన్నీటి గాథ

కరోనా వైరస్ ప్రజలను బయటికి వెల్లకుండా చేయడం మాత్రమే కాదు, తమకు కావలసిన వారు చనిపోతే కనీసం చివరి చూపు చూసుకోలేని పరిస్థిని తీసుకొచ్చింది.

Update: 2020-04-11 05:30 GMT
Admin SI Srinivas (File Photo)

కరోనా వైరస్ ప్రజలను బయటికి వెల్లకుండా చేయడం మాత్రమే కాదు, తమకు కావలసిన వారు చనిపోతే కనీసం చివరి చూపు చూసుకోలేని పరిస్థిని తీసుకొచ్చింది. మొన్నటికి మొన్న ఓ కూతురు చనిపోతే ఆ చిట్టితల్లిని కనీసం చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్తితి. ఇదే కోణంలో ఓ కొడుకు తల్లని, ఓ తల్లి కొడుకుని చూసుకోకుండా చేసింది. అదే విధంగా ఓ అడ్మిన్‌ ఎస్‌ఐ తన సోదరుడిని కడచూపునకు నోచుకోలేకపోయాడు.

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అడ్మిన్‌ ఎస్‌ఐగా పని చేస్తున్న బచ్చు శ్రీనివాస్‌ సోదరుడు రంజిత్‌(35) కేన్సర్‌తో మృతి చెందాడు. కాగా కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయడంలో నిమగ్నమైన అడ్మిన్‌ ఎస్‌ఐ బచ్చు శ్రీనివాస్‌ మృతిచెందిన సమాచారం అందింది.

సోదరుడి మృతివార్త తెలుసుకున్న అతను వెళ్దామని అనుకున్నప్పటికీ ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో తన విధులను వదులి వెల్లలేని పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు తమ తమ కర్తవ్యాన్ని పాటించకపోతే లాక్‌డౌన్‌ అసంపూర్తిగా నడుస్తుందని, ప్రభుత్వం చేపట్టిన చర్యలు వృద్ధా అవుతాయని ఆయన స్టేషన్‌కే పరిమితం అయ్యారు. విషయం తెలిసిన సహోద్యోగులు అతడిని ఓదార్చి సంఘీభావం తెలిపారు. తన సోదరుడి అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూసి కన్నీరు కార్చారు.




Tags:    

Similar News