దినసరి కూలీలకు కరోనా కష్టాలు.. కాళ్లకు గుడ్డలు కట్టుకొని..

Update: 2020-03-28 10:14 GMT

పొట్టకూటి కోసం నగరానికి వెళ్లిన దినసరి కూలీలకు కరోనా కష్టాలు తప్పడం లేదు. లాక్‌డౌన్ కారణంగా తమ గ్రామాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. గ్రామాలకు చేరుకోవాలంటే దాదాపు వంద కిలోమీటర్లు కాలినడకన నడవాల్సి వస్తుందంటూ వాపోతున్నారు. అసలే వేసవి కాలం ఎండలు మండుతున్నాయి. చెప్పులు లేక కొందరు కాళ్లకు గుడ్డలు కట్టుకొని కొందరు నడుస్తూ వారి దీనావస్తను చూపెడుతున్నారు. వికారాబాద్‌ జిల్లా పెద్దేమూల్‌ మండల ప్రజల కష్టాలివి.

లాక్‌డౌన్ వల్ల హోటళ్లు, వాణిజ్య వ్యాపార సంస్థలు మూసివేయడంతో కూలీల కష్టాలు మాములుగా లేవు. లాక్‌డౌన్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుందేమో అని భావించిన నగరానికి వచ్చిన దినసరి కూలీలకు తీరని కష్టాలు మొదలయ్యాయి. ఎటు చూసినా అన్ని బంద్. చివరకు చేసేదేమి లేక తమ సొంత ఊర్లకు వెళ్లాలని నిర్ణయించుకుని తమ గ్రామాలకు వెళ్దామంటే రవాణా సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. ఎవరి దగ్గర తలదాచుకుందామన్నా దరిచేరనీయని పరిస్థితి. బస్సులు ట్రైన్లు కూడా బంద్ అవడంతో రహదారి వెంబడి కాలినడకన బయలు దేరారు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలానికి చెందిన వారు, కాగా మరికొందరు మహబూబ్ నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన కూలీలు.

వీరిలో మగవాళ్లు, మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ల గ్రామాలు హైదరాబాద్‌ నగరానికి 80 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పాపం చిన్న పిల్లల కాళ్లకు చెప్పులు కూడా లేక మండుటెండలో రోడ్డుపై నడుస్తుంటే వేడికి కాళ్లు కాలుతున్నాయంటూ ఏడుస్తుండటం చూసే వాళ్లకు కన్నీరు తెప్పిస్తోంది. మధ్యలో వికారాబాద్ పోలీసులు మానవత్వంతో, మరికొంత మంది దాతలు కూడా వీరిని చూసి అన్నం పెట్టారు.


Full View


Tags:    

Similar News