Komuram Bheem Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో చిరుత కలకలం
Komuram Bheem Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చిరుత కలకలం సృష్టిస్తోంది.
Komuram Bheem Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చిరుత కలకలం సృష్టిస్తోంది. సిర్పూర్ టి.భీమన్న సమీపంలో చిరుతపులి సంచారం.. స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. రైల్వేబ్రిడ్జ్‌పై చిరుతపులి పరుగులు తీయడాన్ని అక్కడున్న వాహనదారులు గుర్తించి.. తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో.. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. చిరుతపులిని పట్టుకునేందుకు బోన్లను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.