Nirmal: నిర్మల్ లో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
Nirmal: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచన
Nirmal: నిర్మల్ లో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పేట్ నుండి బంగల్పేట వినాయక సాగర్ వైపుగా వెళ్లే మార్గంలో చిరుత పులి పాద ముద్రలు కలకలం రేపుతోంది. అది చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటుగా వెళ్లే స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అటవీశాఖ అధికారులు సమాచారం అందించడంతో... ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.