Lakshman Goud: మూతపడిన కల్లు కంపౌండ్‌లను.. తిరిగి ప్రారంభించిన ఘనత పద్మారావుకే దక్కుతుంది
Lakshman Goud: పద్మారావుకు తెలంగాణ గౌడ సంఘం మద్దతు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌గౌడ్
Lakshman Goud: మూతపడిన కల్లు కంపౌండ్‌లను.. తిరిగి ప్రారంభించిన ఘనత పద్మారావుకే దక్కుతుంది
Lakshman Goud: సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌కు తెలంగాణ గౌడ సంఘం మద్దతు ప్రకటించింది. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో పద్మారావుకు మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 2004లో హైదరాబాద్‌లో మూత పడిన కల్లు కంపౌండ్‌లను తిరిగి ప్రారంభించిన ఘనత పద్మారావుకే దక్కుతుందని లక్ష్మణ్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి వేలాది మంది గౌడ్లకు, ఇతరులకు జీవనోపాధి కల్పించారని అన్నారు.