తెలంగాణ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

Update: 2020-05-09 15:43 GMT
KTR

కోవిడ్ పై పోరాట‌ని ప్ర‌ముఖులు త‌మ వంతు సాయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఈరోజు మంత్రి కేటిఆర్ కార్యాలయం ద్వారా ఇవాళ మొత్తం 8 కోట్ల 30 లక్షల విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. వారిలో ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండీ మరియు సీఈవో కేవీ బి రెడ్డి, మూడు కోట్ల విలువైన పీపీ ఈ లతోపాటు, యన్ 95 మస్కులను హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటిఆర్ కి అందించారు.

ఐ టి సి సి ఎం డి సంజీవ్ పూరి ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయల చెక్కుని మంత్రి కేటీఆర్ కి అందించారు. పోచంపాడ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయల విలువైన పిపి ఈ కిట్లను మంత్రి కేటీఆర్ కు అందించింది. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ 36 లక్షల 71 వేల రూపాయల చెక్కులను అందించింది. ఇండియన్ బ్యాంక్ ఎండి మరియు ceo పద్మజా చుండూరు 30 లక్షల రూపాయలు, ఈవెంట్స్ నౌ ప్రైవేట్ లిమిటెడ్ 28 లక్షల రూపాయలు, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్ఫండ్ ప్రెసిడెంట్ జి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయలను అందించారు.

అలాగే టోల్ ప్లాస్ ఇండియా లిమిటెడ్ 25 లక్షల రూపాయలను, రాష్ట్ర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయం తరఫున 23 లక్షల రూపాయలను, త్రిబుల్ లైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 20 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్ కి అందించారు.




 


Tags:    

Similar News