శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు ఇమెయిల్ కలకలం రేపింది.

Update: 2025-12-02 05:08 GMT

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు ఇమెయిల్ కలకలం రేపింది. కువైట్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఫ్లైట్ 6E1234 కు గుర్తు తెలియని వ్యక్తి బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ పంపడంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల కారణంగా ఆ విమానాన్ని హైదరాబాద్‌కు కాకుండా ముంబైకి డైవర్ట్ చేశారు.

విమానంలో మొత్తం 235 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను ముంబైలో సురక్షితంగా ల్యాండ్ చేసి... విమానాన్ని స్కానింగ్ చేసి డాగ్ స్క్వాడ్ ద్వారా పూర్తిగా తనిఖీలు చేపట్టారు. బెదిరింపు ఈమెయిల్ పై నిజమా కాదా అనే దానిపై పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. మరో వైపు శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

Tags:    

Similar News