లాజిస్టిక్‌ హబ్‌ ను ప్రారంభించనున్న కేటీఆర్

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న లాజిస్టిక్‌ హబ్‌ (వస్తు నిల్వ కేంద్రం) నేడు ప్రారంభానికి సిద్ధమైంది.

Update: 2019-10-11 05:10 GMT

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న లాజిస్టిక్‌ హబ్‌ (వస్తు నిల్వ కేంద్రం) నేడు ప్రారంభానికి సిద్ధమైంది. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఈ క్లబ్ ను కేటీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తికావడంతో కమర్షియల్‌ ఆపరేషన్‌ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. నగరంలో వాహనాల రద్దీని నియంత్రించడం, వాయు కాలుష్యం తగ్గించడం కోసం హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.   

Tags:    

Similar News