KTR: ఎమ్మెల్యేపై ఎంపీ దాడి.. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ: కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!
KTR: అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై ఎంపీ మల్లు రవి దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్. కాంగ్రెస్ అరాచక రాజకీయాలపై ధ్వజమెత్తుతూ, సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్
KTR: ఎమ్మెల్యేపై ఎంపీ దాడి.. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ: కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!
KTR: అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా కేటీఆర్ అభివర్ణించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు..గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ.. శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతోందన్నారు.
చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని ఈ ఘటన మరోమారు స్పష్టం చేస్తోందని చెప్పారు. బీఆర్‌ఎస్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోందని.. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలిని..సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలన్నారు.