KTR: ద్వేషం ఎందుకు..?, అన్నం పెట్టే రైతుల మీద అక్కసు ఎందుకు..?

KTR: రైతు బంధువును ఆదరించండి..!

Update: 2023-11-27 11:11 GMT

KTR: ద్వేషం ఎందుకు..?, అన్నం పెట్టే రైతుల మీద అక్కసు ఎందుకు..?

KTR: టీకాంగ్రెస్‌ వ్యవసాయ పాలసీలపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ద్వేషం ఎందుకు..?, అన్నం పెట్టే రైతుల మీద అక్కసు ఎందుకంటూ హస్తం పార్టీపై మండిపడ్డారు. అన్నదాత కడుపునిండా కరెంట్ ఇస్తుంటే చూసి ఓర్వలేని బుద్ధి ఎందుకని ప్రశ్నించారు. 3 గంటల కరెంటే ఇస్తామని మూర్ఖంగా ప్రకటిస్తున్నారెందుకంటూ ధ్వజమెత్తారు మంత్రి. రైతు చేనుకు రక్షణ కంచెగా వుండే ధరణి మీద కక్ష ఎందుకు..? భూమేతకు అనుమతి ఇస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారు ఎందుకంటూ కాంగ్రెస్‌ నిలదీశారు కేటీఆర్. కౌలు రైతులకు, అసలు రైతులకు మధ్య అగ్గిపెట్టి భూములు పడావు పెట్టే ప్రమాదాన్ని తెస్తున్నారెందుకని ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. అన్నదాతలారా కాంగ్రెస్ కంత్రీ పాలసీలను జాగ్రత్తగా పరిశీలించండి..! పండుగలా మారిన సాగును..మళ్లీ దండుగ చేసే దరిద్రపు రోజులు కావాలా..? ఆలోచించండి అని సూచించారు. రైతు బంధువును ఆదరించండి అంటూ రైతులను కోరారు కేటీఆర్.


Tags:    

Similar News