సిరిసిల్లలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌

రాష్ట్రాన్ని అభివృద్ది చేసే దిశగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇప్పటి వరకూ ఎన్నో జిల్లాలను పర్యటించారు.

Update: 2020-02-10 10:21 GMT

రాష్ట్రాన్ని అభివృద్ది చేసే దిశగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇప్పటి వరకూ ఎన్నో జిల్లాలను పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజున ఉదయం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్డు మార్గం గుండా ఆయన సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నారు. అనంతరం గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు గెస్ట్‌హౌజ్‌లో కలెక్టర్‌తో పాటు ఆయా అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను మరింత అబివృద్ది చేయాలని అధికారులకు ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలిని తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఆదుకోవాలన్నారు. అక్కడి నుంచి తంగళ్లపల్లి మండల కేంద్రానికి వెళ్లారు. ఆప్రాంతంతో నూతనంగా నిర్మించిన రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన పోలీసులకు తెలిపారు. ముఖ్యంగా ఇటీవల సమాజంలో ఆడపిల్లల మీదా జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడుతూ ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని తెలిపారు. న్యాయపరంగా విధులు నిర్వహించాలన్నారు.

ఇక పోతే జిల్లాలోని మరి కొన్ని ప్రాంతాలను ఆయన సందర్శించి, అక్కడి ప్రజలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోనున్నారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. ఇక ఈ ఏర్పాటు చేసిన సమావేశంలో సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Tags:    

Similar News