KTR: పేదల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి ఇండ్లు నిర్మించాం
KTR: రాజకీయ ప్రలోభాలకు తావు లేకుండా.. నిజమైన అర్హులకే అందజేత
KTR: పేదల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి ఇండ్లు నిర్మించాం
KTR: హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపడుతున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజకీయ ప్రలోభాలకు తావు లేకుండా.. నిజమైన అర్హులకే ఇండ్లను అందజేస్తునట్టు మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారతదేశంలో ఎక్కడా లేదన్నారు కేటీఆర్. పేదల కోసం.. వేల కోట్లు ఖర్చు పెట్టి.. ఇండ్లను నిర్మించామన్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను బాధ్యత అధికారులకే అప్పగించిందన్నారు కేటీఆర్.