కేసీఆర్‎తో కేటీఆర్, హరీశ్ భేటీ

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్‌పై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది.

Update: 2025-10-22 11:41 GMT

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్‌పై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా కమాండ్ చేపట్టారు.

రేపు ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో ఉపఎన్నిక ప్రచార వ్యూహం, మద్దతుదారుల సమన్వయం, ప్రచార కార్యక్రమాల దిశపై చర్చించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల మధ్య ప్రాథమిక చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News